Song: Mana Jathi Ratnalu
Year: 2021
Viewed: 27 - Published at: 6 years ago

సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డర్ ఖానులు
Value లేని వజ్రాలు మన జాతిరత్నాలు
ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళయినా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
Satelliteకైనా చిక్కరు వీళ్ళో గల్లీ రాకెట్లు
Daily బిల్లుగేట్స్ కి మొక్కే వీళ్ళయి చిల్లుల పాకెట్లు
సుద్ధపూసలు సొంటె మాటలు తిండికి తిమ్మ రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజులు
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డర్ ఖానులు
Value లేని వజ్రాలు మన జాతిరత్నాలు
ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళయినా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయ్ కోతులు
వీళ్లుగాని జపం చేస్తే దూకి జస్తాయి కొంగలు
ఊరి మీద పడ్డారంటే ఉరేసుకుంటాయి వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డాయంటే మిగిలేదింక గోచీలు
పాకిస్థానుకైనా పోతరు free wifi జూపిస్తే
బంగ్లాదేశుకైనా వస్తరు bottle నే ఇప్పిస్తే
ఇంగిల రంగా బొంగరం వేసేత్తడు బొంగరం
వీళ్ళని కెలికినోడ్ని పట్టుకు జూస్తే భయంకరం
तीन की बातों से काम खराब
రాత్రి कामों से नींद खराब
వీళ్ళని బాగు చేద్దాం అన్నోడ్నేమో दिमाग खराब
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డర్ ఖానులు
Value లేని వజ్రాలు మన జాతిరత్నాలు
ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళయినా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
వీళ్ళు రాసిన supplementలతో అచ్చెయచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని గడిపేయచ్చు ఓ శకం
గిల్లి మారి లొల్లి పెట్టె సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యరు గనక బిచ్చము
इज़्ज़त की सवाल అంటే ఇంటి గడప తొక్కరు
బుద్ది గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు
హరిలో రంగ ఆ మొఖం పక్కన మన వానకం
మూడే పాత్రలతో రోజూ వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం డప్పాలు అరాచకం
ఎవనికి మూడుతుందో ఎట్టా ఉందో జాతకం
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డర్ ఖానులు
Value లేని వజ్రాలు మన జాతిరత్నాలు
ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళయినా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

( Rahul Siplingunj )
www.ChordsAZ.com

TAGS :